Ansh Bagri Attacked By Group Of Men.Sustains Head Injuiries


Ansh Bagri Attacked Outside New Delhi Home, Sustains Head Injuries

ముంబై
హిందీ నటుడు అన్ష్ బగ్రీపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. అన్ష్ బగ్రీ హిందీ టీవీ సీరియల్స్‌తో పాటు పలు కార్యక్రమాల్లో నటిస్తూ ఉంటారు. ఆయన ప్రస్తుతం ఢిల్లీలోని పశ్చిమ విహార్‌లో నివశిస్తున్నారు. కాగా కొద్ది రోజుల క్రితం అన్ష్ నివాసానికి చేరుకున్న 10 మంది దుండగులు అతడిపై విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ దాడిలో అన్ష్‌ తలకు తీవ్రగాయాలు కావడంతో అతడిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అన్స్‌ తన ఇంటిని నిర్మించేందుకు ఓ కాంట్రాక్టర్‌ను మాట్లాడుకున్నాడు. అయితే నిర్మాణ సమయంలో అన్ష్‌తో వివాదం రావడంతో ఆ కాంట్రాక్టర్‌ను వెళ్లిపోయాడు. అయితే ఆ కోపంతో అన్ష్‌పై దాడిచేసేందుకు కొంతమందిని పంపించాడు. శనివారం అన్ష్ ఇంటికి చేరుకున్న ఆ దుండగులు విచక్షణారహితంగా దాడి చేసి గాయపర్చారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

Popular posts from this blog

Flipkart Launches Quick Services In Bangalore